కోల్కతా : పశ్చిమ బెంగాల్లో భారీగా బంగారం పట్టుబడింది. నార్త్ 24 పరగణా జిల్లాలోని ఇండియా – బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఇచ్చామతి నది వద్ద బీఎస్ఎఫ్ బలగాలు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుంచి 40 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. కోట్లలో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. బంగారాన్ని సీజ్ చేశామని, దాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
West Bengal | BSF troops recovered 40 Gold biscuits from the bank of Ichamati River at the India-Bangladesh border in North 24 Parganas district: South Bengal Frontier, Border Security Force pic.twitter.com/EWXtYodwlE
— ANI (@ANI) March 17, 2022