శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కిష్టవార్ జిల్లాలో ఉన్న అథోలి పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో సుమారు 40 మంది ఆర్మీ సిబ్బంది( Army Personnel)పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్మీ సిబ్బందిలో ఓ కమాండింగ్ ఆఫీసర్, మేజర్ కూడా ఉన్నారు. ఓ వాహనాన్ని సీజ్ చేసిన ఘటనలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. అయితే అథోలీ పోలీసు స్టేషన్‌కు కర్రలు, రాడ్లతో వచ్చిన ఆర్మీ సిబ్బంది.. విధులు నిర్వహిస్తున్న పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారు. 17 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్, ల్నల్ ఎన్ అరుణ్ గాంధీ, మేజర్ వికాశ్ శర్మ, నయిబ్ సుబేదార్ శంకర్ గుర్కేతో పాటు సుమారు 40 మంది వరకు గుర్తు తెలియని ఆర్మీ సిబ్బంది పోలీసు స్టేషన్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆఫీసర్లపై దాడి, స్టేషన్ పరిధిలోనే పోలీసు సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమానిత వ్యక్తలపై హత్యాయత్నం, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం ఆరోపణలు ఎదుర్కోనున్నారు. ఈ ఘటనలో దర్యాప్తునకు సహకరించనున్నట్లు ఆర్మీ ప్రకటించింది. సంయుక్త దర్యాప్తు అనంతరం తగిన రీతిలో చర్యలు తీసుకుంటామని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. డీఎస్పీ విజయ్ కుమార్ భగత్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అమృత్ కాటోచ్ ఉన్నారు. మేజర్ వికాశ్ శర్మ చాలా దురుసుగా ప్రవర్తించారని, భౌతిక దాడికి పాల్పడ్డారని, ఎస్డీపీఓపై దాడి చేశారని డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.
ముందస్తు ప్లాన్‌తోనే ఆర్మీ సిబ్బంది దాడి చేశారని, ఆ దాడిలో అనేకమంది పోలీసులు గాయపడినట్ల ఎఫ్ఐఆర్లో తెలిపారు. లాఠీలు, ఐరన్ రాడ్లు, సర్వీస్ వెపన్స్‌తో ఆర్మీ సిబ్బంది కొట్టేందుకు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. కిష్టవార్ అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఓ ఆర్మీ వాహనాన్ని సీజ్ చేయడం వల్ల ఈ ఘటన జరిగింది.