Boy Dead Body | ముంబై : ఓ నాలుగేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ రైల్లోని టాయిలెట్లో పడేశారు. ఈ దారుణ ఘటన ఖుషి నగర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఖుషి నగర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు గోరఖ్‌పూర్(ఉత్తరప్రదేశ్) – లోకమాన్య తిలక్ టెర్మినస్(ముంబై) మధ్య తిరుగుతుంది. అయితే ఈ రైలు శనివారం తెల్లవారుజామున లోకమాన్య తిలక్ టెర్మినస్‌లో ఆగింది. ఇక కార్మికులు రైలును శుభ్రం చేస్తుండగా, బీ2 కోచ్‌లోని టాయిలెట్‌లోని చెత్త డబ్బాలో మృతదేహం లభ్యమైంది. దీంతో పారిశుద్ధ్య కార్మికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆ కోచ్ వద్దకు చేరుకున్న పోలీసులు బాలుడి డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గవర్నమెంట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీ2 కోచ్‌లో ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.