లక్నో: కరడుగట్టిన నేరస్తున్న పుట్టిన రోజు వేడుకలు (Criminal Birthday) ఓ బార్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. దానికి నలుగులు పోలీసు అధికారులు (Policemen) పాల్గొన్నారు. మద్యం సేవిస్తూ బార్ గర్ల్‌తో (Bar Girl) డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆహుతుల్లో కొందరు మద్యం మత్తులో జోరుగా డ్యాన్స్ చేస్తున్న ఆ పోలీసులను తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో అవి వైరల్ కావడంతో ఇంకేముంది వారిపై వేటు పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో (Ghaziabad) జరిగింది.
సోమవారం రాత్రి ఇర్షద్ మాలిక్ అనే ప్రముఖ క్రిమినల్ పుట్టిన రోజు వేడుకలు ఘజియాబాద్‌లోని ఓ బార్లో నిర్వహించారు. దీనికి సాహిబాబాద్ బార్డర్ ఔట్‌పోస్ట్ ఇన్చార్జ్ ఆషిశ్ జాడోన్, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఈ విందుకు హాజరయ్యారు. అసలే పోలీసులు, ఆపై క్రిమినల్ బర్త్‌డే పార్టీ. చేతిలో బీర్ బాటిళ్లు. ముందు బార్ గర్ల్. ఇంకేముంది బీర్ తాగుతూ ఆ నలుగురు పోలీసు అధికారులు బార్ గర్ల్‌తో ఫుల్ జోష్‌లో పాటలకు తగ్గట్టు స్పెప్పులు వేశారు. ఆనందంలో మునిగితేరుతున్న వారిని చూసి ముచ్చటపడిన కొందులు.. తమ ఫోన్లలో రికార్డు చేసి.. 22 సెకండ్ల పాటు ఉన్న ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అసలే బీజేపీ పాలిత రాష్ట్రం. క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. నేరం చేస్తే చాలు ఎన్కౌంటర్ చేసిపడేస్తున్నారు. మరి క్రిమినల్స్‌తో అంటకాగుతూ.. వారి పార్టీలకు హాజరవుతున్న పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దామని అనుకున్నారో ఏమో జనం. గంటల వ్యవధిలోనే ఆ వీడియోను తెగ షేర్ చేసేశారు. చివరికి అది పోలీసులు ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో వారిపై చర్యలకు ఆదేశించారు. దీంతో ఘజియాబాద్ డిప్యూటీ కమిషర్ ఆఫ్ పోలీసులు.. ఆ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీచేశారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అదేవిధింగా శాఖా పరమైన విచారణకు ఆదేశించారు.
यूपी- गाजियाबाद में हिस्ट्रीशीटर इरशाद मलिक की बर्थडे पार्टी थी। UP पुलिस के दरोगा आशीष जादौन, सिपाही योगेश और ज्ञानेंद्र पहुंच गए। हाथ में बियर लेकर डांस गर्ल संग खूब ठुमके लगाए। अब तीनों सस्पेंड हो गए हैं। pic.twitter.com/31cN1Su41V
— Sachin Gupta (@SachinGuptaUP) September 30, 2025