Fire Accident : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని శాస్త్రినగర్లో నాలుగంతస్తుల నివాసం భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మంటల్లో చిక్కుకున్న నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా తొమ్మిది మందిని సహాయ సిబ్బంది రక్షించారు.
మృతులను మనోజ్ (30). సుమన్ (28)గా గుర్తించగా మరో ఇద్దరు చిన్నారులు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.
ఘటన సమాచారంతో 9 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు మృతదేహాలు కనిపించాయని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలేంటనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
Read More :