బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బెంళూరు శివార్లలోని పూర్వకారా అపార్ట్మెంట్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం దాటికి కారు నుజ్జునుజ్జు అయింది. కాగా, ప్రమాదానికి గురైన లారీ ముందున్న మరో లారీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.