ధన్‌బాద్, ఫిబ్రవరి 1: జార్ఖండ్‌లోని ధన్బాద్లో మూడు బొగ్గు గనులు కూలిపోయాయి. ప్రమాదంలో 13 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గనుల లోపల మరికొంత మంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వారి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నిర్సా, ధన్‌బాద్ పరిధిలో ఉన్న ఈ బొగ్గు గనులను గతంలోనే మూసివేశారు. అయితే, కొంత మంది అక్రమంగా గనుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది.