Heavy rains | హిమాచల్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 4 నెలల చిన్నారిసహా నలుగురు మృతి
హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ (Uttarakhand), హిమాచల్‌ప్రదేశ్‌లు (Himachal Pradesh) భారీ వర్షాలకు (Heavy rains) అతలాకుతమవుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఆకస్మిక వరదలు (Flash floods), కొడచరియలు (Landslides) విరిగిపడటం వంటి ముప్పు ఎప్పుడేది ముంచుకొస్తుందోనని ప్రజలు దినదినగండంగా గడుపుతున్నారు.
న్యూఢిల్లీ: హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ (Uttarakhand), హిమాచల్‌ప్రదేశ్‌లు (Himachal Pradesh) భారీ వర్షాలకు (Heavy rains) అతలాకుతమవుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఆకస్మిక వరదలు (Flash floods), కొడచరియలు (Landslides) విరిగిపడటం వంటి ముప్పు ఎప్పుడేది ముంచుకొస్తుందోనని ప్రజలు దినదినగండంగా గడుపుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో సోమవారం కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ఓ నాలుగు నెలల చిన్నారి కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మరొకరు గల్లంతయ్యారని, వారికోసం గాలింపు చేపట్టామని వెల్లడించారు. చంబా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ట్యాక్సీ స్టాండ్ సమీపంలో కొండచరియ విరిగిపడటంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.
కాగా, రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలతోపాటు ఒకటి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. డెహ్రాడూన్, పౌరీ, నైనిటాల్, ఛంపావట్, బాగేశ్వర్ జిల్లాలకు వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ (Orange alert) ప్రకటించింది.

ఇక హిమాచల్ ప్రదేశ్‌లో నేటి నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. చంబా, మండీ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 26 వరకు అసాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

