శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఇటీవల కిష్టార్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి (Cloudburst) వరదలు ముంచెత్తడంతో 60 మందికి మారణించిన విషయం తెలిసిందే. తాజాగా కథువా జిల్లా జంగ్లోటే సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని నలుగురు మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు. వరదల ధాటికి రైల్వే ట్రాక్‌లు, 44వ జాతీయ రహదారితోపాటు కథువా పోలీస్ స్టేషన్ దెబ్బతిన్నది. ఆయా ప్రాంతాల్లో స్థానికులతోపాటు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్చల్లో పాల్గొన్నారు.
వరదలపై కేంద్ర మంత్రి, ఉధంపూర్ ఎంపీ జితేంద్ర సింగ్ స్పందించారు. జిల్లా ఎస్పీ శోభిత్ సక్సేనాతో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆరాతీశారు. ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
J&K’s Kathua cloudburst | An incident of flash floods and a landslide took place at Jodh village in Kathua. 2-3 houses have been affected by the landslide. There are reports of six people trapped; rescue operations are underway. Some roads on the way have also been washed out due… https://t.co/bQfW8Q31xj
— ANI (@ANI) August 17, 2025