అహ్మదాబాద్: ఒక సిగ్నల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పింది. ముందున్న వాహనాలపైకి అది దూసుకెళ్లింది. (Electric Bus Rams Into Vehicles) దీంతో బైక్స్‌పై వెళ్తున్న వారిలో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో నలుగురు గాయపడ్డారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పింది. ఇందిరా సర్కిల్ సిగ్నల్ వద్ద ముందు వెళ్తున్న బైక్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఏడేళ్ల బాలుడితో సహా మరో నలుగురు గాయపడ్డారు. 35 ఏళ్ల రాజు, 40 ఏళ్ల సంగీత చౌదరి, 25 ఏళ్ల చిన్మయ్ భట్, 56 ఏళ్ల కిరణ్ కక్కర్గా మృతులను గుర్తించారు.
కాగా, ఆగ్రహించిన స్థానికులు బస్సుపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో డ్రైవర్ శిశుపాల్ సింగ్ రాణా గాయపడ్డాడు. పోలీసులు అక్కడకు చేరుకుని లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన తర్వాత అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఆ ఎలక్ట్రిక్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రమాదంపై స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Electric Bus Runs over People in #Rajkot Gujarat.
Doest not look like #Accident but a planned attack.
Police need to find him & Punish.#BusAccident #Shocking #BAD #ViralVideo #earthquake #zaheerkhan #ChennaiRains #TRain #PoojaHegde pic.twitter.com/odcUViDL9L— Dhiren Patel (@DhirenP66827872) April 16, 2025