Bus Catches Fire | బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ.. మంటల్లో నలుగురు సజీవ దహనం, 10 మందికి గాయాలు
Bus Catches Fire | ఆయిల్ ట్యాంకర్ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో పది మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అహ్మదాబాద్: ఆయిల్ ట్యాంకర్ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో పది మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Bus Catches Fire) గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లగ్జరీ ప్రైవేట్ బస్సు 40 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్ వైపు వెళ్తున్నది.
కాగా, గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చోటిలా-రాజ్కోట్ జాతీయ రహదారిలోని సంగని గ్రామం సమీపంలో టైర్ పేలడంతో ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న బస్సు ఆ ట్యాంకర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. బస్సులోని ప్రయాణికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
మరోవైపు నలుగురు ప్రయాణికులు మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. మరో పది మందికి కాలిన గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడంతోపాటు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
4 Killed After Private Bus Catches Fire Near Chotila https://t.co/Lp3KzGeaDU pic.twitter.com/AfsaoYFiqV
— DeshGujarat (@DeshGujarat) May 14, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

