న్యూఢిల్లీ, మే 1: భారత్‌లో దేశీయ విమానయానం ఏప్రిల్ 30న సరికొత్త రికార్డ్‌ను అందుకున్నదని పౌర విమానయాన శాఖ తెలిపింది. గత ఆదివారం ఎయిర్ ట్రాఫిక్ ఆల్ టైం గరిష్టస్థాయికి చేరుకున్నది.
ఆ ఒక్కరోజులో దేశీయంగా 2,978 విమాన ప్రయాణాలు జరగ్గా, మొత్తం 4,56,082 మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకున్నారని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్లో తెలిపారు.