Rare Surgery: ఓ పేషెంట్ కడుపులో 39 నాణాలు, 37 అయస్కాంతాలు.. వాటిని ఎందుకు తిన్నాడంటే?
Rare Surgery: గంగా రామ్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. ఓ పేషెంట్ కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు. ఆ రోగి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన సర్జరీ(Rare Surgery) చేశారు. ఓ పేషెంట్ కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు. ఆ రోగి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అయితే బాడీ బిల్డింగ్ కోసం అవసరమైన జింక్ పదార్ధాన్ని త్వరగా పొందాలన్న ఉద్దేశంతో ఆ రోగి నాణాలు, మ్యాగ్నెట్లు తిన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల వ్యక్తి ఇటీవల తీవ్రమైన వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డాడు. 20 రోజుల నుంచి అవస్థపడుతున్న ఆ వ్యక్తి ఏమీ తినలేకపోయాడు. దీంతో ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్లు సీటీ స్కాన్ చేయగా అతని కడుపులో నాణాలు, అయస్కాంతాలు ఉన్నట్లు తేల్చారు. చిన్న పేగులో రెండు చోట్ల మ్యాగ్నెట్లు, కాయిన్లు నిలిచిపోయినట్లు సర్జరీలో తేలినట్లు డాక్టర్లు చెప్పారు. దాని వల్ల ఆహారం తీసుకున్నా లోపలికి వెళ్లలేదు.
పేగును కోసి ఆ నాణాలను, మ్యాగ్నెట్లను తీశారు. రూ.1, రూ.2, రూ.5కు చెందిన 39 నాణాలు, రకరకాల ఆకారంలో ఉన్న 37 మ్యాగ్నెట్లు కడుపు నుంచి తీశారు. సర్జరీ తర్వాత ఏడు రోజులకు అతన్ని డిస్చార్జ్ చేశారు. శరీర ధారుఢ్యం కోసం జింక్ అవసరమని, అందుకే మ్యాగ్నెట్లను మింగినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. నాణాల్లో జింక్ మూలకం ఉంటుందని, అయితే అది కడుపులో ఎక్కువ సేపు ఉండాలంటే మ్యాగ్నెట్ అవసరమని ఆ వ్యక్తి రెంటిండిని తీసుకున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

