మహారాష్ట్రలో ప్రధాని మోదీ గత ఏడాది ఆవిష్కరించిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం కుప్పకూలింది. సింధుదుర్గ్ జిల్లా రాజ్కోట్ కోట వద్ద ఏర్పాటుచేసిన ఈ విగ్రహం ఎలా కూలిందన్నది తెలియరాలేదు. ఈ విగ్రహ నిర్మాణంలో లోపాలున్నాయని, పనుల్లో నాణ్యత లేనందునే విగ్రహం కుప్పకూలిందని విపక్షాలు ఆరోపించాయి.
డెహ్రాడూన్, ఆగస్టు 26: కేదార్నాథ్ గుడిని పోలిన ఆలయాన్ని ఢిల్లీలో నిర్మించాలన్న ప్రతిపాదనపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఢిల్లీలోని బురారీలో తలపెట్టిన ఆలయ నిర్మాణ ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్టు కేదార్నాథ్ ధామ్ ఢిల్లీ ట్రస్ట్ అధ్యక్షుడు సుమన్ మిట్టల్ సోమవారం వెల్లడించారు. ఉత్తరాఖండ్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చిందని, ప్రజల మత విశ్వాసాలు దెబ్బతింటాయని తాము భావిస్తున్నామని సుమన్ మిట్టల్ అన్నారు.