న్యూఢిల్లీ: గడచిన ఆరు నెలల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్టుబడుల కుంభకోణాల బాధితులు 30,000 మందికిపైగానే ఉన్నారు. వీరు రూ.1,500 కోట్ల మేరకు నష్టపోయారు. ఈ కేసుల్లో 65 శాతం మేరకు బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్ల నుంచి వచ్చాయి.
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ వివరాలను వెల్లడించింది. బెంగళూరు అత్యధిక ఆర్థిక నష్టానికి గురవుతున్న నగరం. పని చేసే వయసు గల వారే అత్యధికంగా బాధితులవుతున్నారు. బాధితుల్లో 76 శాతం మంది 30-60 సంవత్సరాల మధ్య వయస్కులు.