
బహదూర్గఢ్(హర్యానా), అక్టోబర్ 28: రైతు ఉద్యమంలో భాగంగా టిక్రిలో నిరసనల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న మహిళా రైతులను ట్రక్కు ఢీకొట్టింది. హర్యానాలోని బహదూర్గఢ్లో గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి గాయాలయ్యాయి. మహిళా రైతులు బహదూర్ గఢ్ నుంచి పంజాబ్లోని తమ గ్రామం మన్సాకు వెళ్లేందుకు బయల్దేరారు. రైల్వే స్టేషన్కు వెళ్లడానికి పకోడా చౌక్ దగ్గర ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వస్తున్న ట్రక్కు వారిని ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. చనిపోయినవారిని చిందర్ కౌర్(60), అమర్జీత్ కౌర్(58), గుర్మాయిల్ కౌర్(60)గా గుర్తించారు.