Union Budget 2022: మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధికి… మూడు పథకాలు

న్యూఢిల్లీ: మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం మూడు పథకాలను ప్రారంభించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలను వివరించారు. ఈ పథకాల ద్వారా మహిళల మేధో, సామాజిక, ఆర్థికవృద్ధి మెరుగుపడుతున్నదని అన్నారు. మహిళలు, పిల్లల సాధికారతకు తమ ప్రభుత్వం ఎన్నో చేస్తున్నదని చెప్పారు. ‘మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సమర్థ అంగన్వాడీ-పోషణ్ 2.0 వంటి పథకాలను ప్రభుత్వం సమగ్రంగా పునరుద్ధరించింది. నారీ శక్తి ప్రాముఖ్యతను గుర్తిస్తూ, మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధిని అందించడానికి ఈ మూడు పథకాలు ప్రారంభించాం’ అని తెలిపారు.
పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బాలల అభివృద్ధి కోసం అంగన్వాడీలను క్లీన్ ఎనర్జీతో అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు. పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అప్‌గ్రేడ్ చేసిన అంగన్వాడీలు ఈ దిశలో కీలకంగా ఉంటాయని అన్నారు.
మహిళల జీవితాల మెరుగు కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మహిళల అభివృద్ధి, మహిళా సాధికారతకు లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ శక్తిని బలోపేతం చేయడంతోపాటు దీనిని మరింతగా విస్తరించినట్లు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మిషన్ శక్తి విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తద్వారా దేశ నిర్మాణానికి ఇది సహాయపడుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

