శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 14:57:42

3 కొత్త చేప‌లు గుర్తించిన ప‌రిశోధ‌కులు

3 కొత్త చేప‌లు గుర్తించిన ప‌రిశోధ‌కులు

ముంబై:  ప‌శ్చిమ క‌నుమ‌లలో మూడు ర‌కాల కొత్త చేప‌ల‌ను ప‌రిశోధ‌కులు గుర్తించారు. బాంబే నేచుర‌ల్ హిస్ట‌రీ సొసైటీ (బీఎన్‌హెచ్ఎస్), కేర‌ళ యూనివ‌ర్సిటీ ఆఫ్ ఫిష‌రీస్, ఓషియ‌న్ స్ట‌డీస్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ రీసెర్చ్ (పూణే) ప‌రిశోధ‌కులు జ‌న్యు విశ్లేష‌ణ ఆధారంగా జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో బార్బ్ జాతికి చెందిన మూడు డాకిన్షియా (ఫిల‌మెంట్ బార్బ్స్ ) చేప‌లను గుర్తించారు. 

మంచి నీటిలో నివ‌సించే ఈ చిన్న చేప‌లు భార‌త‌దేశ ద్వీప‌క‌ల్ప ప్రాంతంలోని న‌దుల్లో స‌మూహాలుగా క‌నిపిస్తుంటాయి. ఆక్వేరియంలో పెట్టుకునే చేప‌లుగా ఇవి చాలా ప్రాముఖ్య‌త పొందిన‌వి. బంగారు వ‌ర్ణ‌పు పొలుసులు, బూడిద‌రంగు, ఎరుపు రంగు క‌ల‌గ‌లిపిన వాజాల‌తో చూపరుల‌ను ఆకట్టుకుంటున్నాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo