చెన్నై: తమిళనాడులోని శివకాశిలో (Shivakasi) భారీ అగ్నిప్రమాదం జరిగింది. శివకాశీలోని ఓ పటాకుల పరిశ్రమలో (Cracker factory) పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను శివకాశి దవాఖానకు తరలించారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారని వెతుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.