రుద్రప్రయాగ్, జూలై 21: కేదార్నాథ్ యాత్రికులపై కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో ముగ్గురు భక్తులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఆదివారం నడకమార్గాన భక్తులు వెళ్తుండగా గౌరీకుండ్-కేదార్నాథ్ మార్గంలో చిర్బాసా ప్రాంతంలో వీరిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా 8 మంది గాయపడ్డారు.