UP Encounter | ఉత్తరప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్ (UP Encounter) చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో పంజాబ్ సరిహద్దుల్లో పోలీసు పోస్టుల (police post)పై గ్రనేడ్ దాడులు జరిపిన ఘటనల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు (Khalistani Terrorists) హతమయ్యారు.
వీరు ముగ్గురూ అనుమానాస్పద వస్తువులతో ఫిలిబిత్ జిల్లాలోని పురానాపూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ క్రమంలో యూపీ, పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నిందితులు గుర్వీందర్ సింగ్, వీరేంద్ర సింగ్, జసన్ ప్రీత్ సింగ్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆ ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి ఏకే రైఫిల్స్, పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Pilibhit, Uttar Pradesh | An encounter took place between a joint team of Uttar Pradesh Police and Punjab Police and three criminals who had thrown grenades at a police post in the Gurdaspur district of Punjab were injured. Later, the three criminals were declared dead. Two AK… pic.twitter.com/3aRCPKNUP5
— ANI (@ANI) December 23, 2024
Also Read..
Donald Trump | మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా..? ట్రంప్ సమాధానం ఇదే..!
PV Sindhu | అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఫొటో వైరల్