Cash in MLA Car | జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న కారులో భారీగా నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పోలీసులు శనివారం ఆ సొమ్ము జప్తు చేశారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచప్, నామన్ బిక్సాల్లను పోలీసులు విచారిస్తున్నారు. నోట్ల మిషన్ యంత్రాల సాయంతో ఆ కారులో ఉన్న నగదు ఎంతో లెక్కిస్తున్నారు.
జార్ఖండ్‌లోని జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వంలో కాంగ్రెస్ మిత్ర పక్షంగా ఉంది. జార్ఖండ్‌లోని జంతారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీకి చెందిన టయోటా ఫార్చ్యూనర్ ఎస్యూవీ కారుగా చెబుతున్నారు. ఈ అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. పశ్చిమ బెంగాల్లో ఎటువంటి రాజకీయ ప్రశ్నలు తలెత్తలేదు.