Ayushmann Khurrana | బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, టాలెంటెడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న తాజా యాక్షన్-కామెడీ చిత్రం ‘ఉడ్తా తీర్’(Udta Teer). ఆకాష్ ఎ. కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా ‘బిలాల్’ అనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. రహస్య మిషన్‌లో భాగంగా భారత్‌కు వచ్చిన అతను, అనుకోని ప్రమాదం కారణంగా తన జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ఇక అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడంతో తాను పాకిస్థాన్ తరఫున గూఢచారిగా వచ్చానన్న విషయాన్ని పూర్తిగా మరచిపోతాడు. అంతేకాదు, భారతదేశంలో ఉంటున్న సమయంలో అతడిలో విపరీతమైన దేశభక్తి పుట్టుకొచ్చి, తనే స్వయంగా ఇండియా కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ (CTS) ఆఫీసర్ అని బలంగా నమ్ముకుంటాడు. పాకిస్థాన్ పంపిన గూఢచారి అనుకోకుండా ఇండియాకు అనుకూలంగా మారిపోయి, అక్కడే దేశభక్తుడిగా తిరుగుతుండటంతో పాకిస్థాన్ హ్యాండ్లర్లకు తలనొప్పిగా మారుతుంది. అయితే అనంతరం జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా కథ. ఇందులో సారా అలీ ఖాన్ పవర్ ఫుల్ సీటీఎస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారు.
ఈ చిత్రంతో ఆకాష్ కౌశిక్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, కరణ్ జోహార్‌కు చెందిన ‘ధర్మ ప్రొడక్షన్స్’ మరియు గునీత్ మోంగాకు చెందిన ‘సిఖ్యా ఎంటర్టైన్మెంట్’ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రాహుల్ బోస్, రామ్ కపూర్, గుషన్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ స్పై-కామెడీ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.
AYUSHMANN KHURRANA – SARA ALI KHAN: ‘UDTA TEER’ TRAILER OUT NOW – 9 OCT 2026 RELEASE… Looks like a fun family entertainer packed with comedy, chaos, and action.
Dharma Productions and Sikhya Entertainment have unveiled the trailer of #UdtaTeer, which is slated for a theatrical… pic.twitter.com/T5T2A7fjBy
— taran adarsh (@taran_adarsh) September 23, 2026