న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకున్నది. సివిల్స్ కోచింగ్కు (Civils Aspirants) వెళ్లిన ముగ్గురు భారీ వర్షాలకు బలయ్యారు. భారీ వర్షాల కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్లో రావుస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద పోటెత్తింది. దీంతో అందులో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీటమునిగారు. సమాచారం అందుకున సహాయక సిబ్బంది 30 మందిని రక్షించగా, మరో ముగ్గురు మరణించారు. వారిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
శనివారం సాయంత్రం 7.15 గంటలకు ఓల్డ్ రాజిందర్ నగర్లో ఉన్న రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు సమాచారం వచ్చిందని ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ తెలిపారు. వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి వెళ్లామని, అప్పటికే బేస్మెంట్ మొత్తం నీటితో నిండి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు మహిళ అభ్యర్థులు, ఒక పురుష అభ్యర్థి మృతదేహాలను వెలికి తీశామని వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. ఈ దుర్ఘటనపై క్రిమినల్ కేసు నమోదుచేశామని, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని సీనియర్ పోలీస్ అధికారి హర్షవర్ధన్ చెప్పారు. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. మృతులను తానియా సోని (25), శ్రేయ యాదవ్ (25), నవిన్ డాల్విన్ (28)గా గుర్తించామన్నారు.
#WATCH | Old Rajender Nagar incident | Delhi: Rescue and search operations are underway at the IAS coaching centre in Old Rajender Nagar where three students lost their lives after the basement was filled with water.
(Morning visuals from the spot) pic.twitter.com/nlH2RAR4nW
— ANI (@ANI) July 28, 2024
కాగా, సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మృతికి నిరసనగా విద్యార్థలు కోచింగ్ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై 24 గంటల్లోగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిశీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్కుమార్ను ఆదేశించారు. ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించామన్నారు.
#WATCH | Old Rajender Nagar Incident | Delhi: Students continue to protest against the MCD and the coaching institute where three students lost their lives after the basement of the institute was filled with water yesterday pic.twitter.com/9Erd7TgOAt
— ANI (@ANI) July 28, 2024
#WATCH | Delhi: Students continue to protest outside the coaching institute where three students lost their lives after the basement of the institute was filled with water yesterday pic.twitter.com/8JGEZ9Rl7o
— ANI (@ANI) July 28, 2024
#WATCH | Old Rajender Nagar incident | Delhi: A group of students staged a protest against the MCD outside the place where the basement of a coaching class was filled with water claiming the lives of three students pic.twitter.com/Siyk5C2nDP
— ANI (@ANI) July 27, 2024