Manipur | కాల్పుల్లో చర్చి నేతలు మృతి.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత
Manipur | జాతుల పోరుతో రగులుతున్న మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొన్నది. వాహనాల్లో ప్రయాణిస్తున్న చర్చి నేతలపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో జాతీయ రహదారి దిగ్బంధానికి కుకీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది.
ఇంఫాల్: జాతుల పోరుతో రగులుతున్న మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొన్నది. వాహనాల్లో ప్రయాణిస్తున్న చర్చి నేతలపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో జాతీయ రహదారి దిగ్బంధానికి కుకీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. (Manipur) బుధవారం చురాచంద్పూర్ జిల్లాలోని లామ్కాలో జరిగిన థాడౌ బాప్టిస్ట్ అసోసియేషన్ (టీబీఏ) సమావేశానికి కొందరు చర్చి నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత రెండు వాహనాల్లో కాంగ్పోక్పికు బయలుదేరారు.
కాగా, మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు వారి వాహనాలపై కాల్పులు జరిపారు. టీవీఏకు చెందిన ముగ్గురు చర్చి నేతలు ఈ కాల్పుల్లో మరణించారు. మణిపూర్ బాప్టిస్ట్ కన్వెన్షన్ (ఎంబీసీ) మాజీ ప్రధాన కార్యదర్శి రెవ. వీ సిట్లౌ, రెవ. వీ కైగౌలున్, పాస్టర్ పాగౌలెన్గా మృతులను గుర్తించారు.
మరోవైపు ఈ దాడిలో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన రెవ. ఎస్.ఎం. హాపు, రెవ. హెకై సిమ్టే, రెవ. పావోతాంగ్, రెండు వాహనాల డ్రైవర్లు లెలెన్, గౌమాంగ్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే చర్చి నేతలపై కాల్పులు జరిపి హత్య చేయడాన్ని కుకీ విద్యార్థి సంఘం ఖండించింది. నాగాలాండ్, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మణిపూర్‌ను అనుసంధానించే కీలక జాతీయ రహదారి 2ను తక్షణమే దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. ఈ సంఘటన నేపథ్యంలో కుకీ, జో ప్రజలు నివసించే కాంగ్పోక్పి, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్నది.
Deeply pained by the terrorist attack on Thadou Church leaders in Manipur today. Heartbreaking and unbearable.
Today, these church leaders laid down their lives in service and faith to God. To live is Christ, and to die is gain. Yet one painful question remains – is this due to… pic.twitter.com/CnhVjyoQGB
— Michael Lamjathang Thadou (@Michael_Thadou) May 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

