
Lok Sabha | న్యూఢిల్లీ: గడచిన ఐదేండ్లలో ఏనుగుల దాడుల్లో 2,853 మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్య సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గురువారం ఈ మేరకు సమాధానమిచ్చారు.

దేశంలోని వివిధ కోర్టుల్లో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ఇందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్లోని కింది స్థాయి కోర్టుల్లో 1.18 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది.
గత ఐదేండ్లలో విదేశాల్లో వివిధ కారణాలతో 633 మంది భారతీయ విద్యార్థులు మృతిచెందారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇదే వ్యవధిలో, దాడుల కారణంగా 19 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ శుక్రవారం పార్లమెంట్లో వెల్లడించారు.

గత ఐదేండ్లలో దేశంలో 628 పులులు చనిపోయినట్టు కేంద్రం తెలిపింది. అక్రమంగా వేటాడటం, సహజ మరణం, తదితర కారణాల వల్ల ఇవి మరణించినట్టు వెల్లడించింది. గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు.
