లక్నో: ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్లో బిల్డింగ్ సెంట్రింగ్ కూలడంతో శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నారు. (Kannauj Railway Station) దీంతో వారిని కాపాడేందుకు16 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆదివారం ఉదయం 28 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రక్షించిన వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని చెప్పారు.
కాగా, కన్నౌజ్ రైల్వే స్టేషన్లో కొత్తగా రెండంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తున్నారు. అయితే స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ శనివారం కూలిపోయింది. శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితోపాటు జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, రైల్వే సిబ్బంది, రెస్క్యూ బృందాలు రాత్రంతా శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు బిల్డింగ్ స్లాబ్ సెంట్రింగ్ కూలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video Captures Exact Moment When Under-Construction Building Collapsed At Kannauj Railway Station | #WATCH #Viral #ViralVideo #Kannauj #UttarPradesh pic.twitter.com/4V1QVdyOLt
— TIMES NOW (@TimesNow) January 12, 2025