Maoists surrender : జార్ఖండ్ (Jarkhand) లో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. ఆ రాష్ట్ర డీజీపీ తదాషా మిస్త్రీ (Thadasha Mistri) సమక్షంలో లొంగిపోయారు. మొత్తం 27 మంది మావోలు జార్ఖండ్ పోలీసు సీనియర్ అధికారుల ఎదుట ఆయుధాలతో లొంగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది జార్ఖండ్ చరిత్రలోనే రికార్డు. వీరిలో చాలామంది మోస్ట్ వాంటెడ్ (Most wanted Maoists) మావోయిస్టులు కూడా ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ నవజీవన్కు ప్రభావితమై వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు వెల్లడించారు. 2026లో రాష్ట్రంలో 22 మంది మావోయిస్టులను మట్టుబెట్టగా.. 44 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 29 మంది లొంగిపోయారన్నారు. మిగిలినవారు జనజీవన స్రవంతిలోకి చేరినట్లు పేర్కొన్నారు. ఇవాళ లొంగిపోయిన 27 మందికి పునరావాసం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.
ఇవాళ లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ చివరి యాక్టివ్ పోలిట్ బ్యూరో సభ్యుడు మిశ్ర్ బస్త్ర అలియాస్ సాగర్జీ కూడా ఉండే అవకాశం ఉందని తొలుత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటివరకు అధికారుల నుంచి వెలువడిన ప్రకటనలో మాత్రం ఆయన పేరు ప్రస్తావన లేదు. తాజాగా లొంగిపోయిన వారిలో ఆయన సన్నిహిత బృందంలోని టాప్ కమాండర్లు, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.