ముంబై: దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎయిర్ ఇండియా(Air India) చేపట్టిన రిక్రూట్మెంట్ డ్రైవ్లో తొక్కిసలాట జరిగింది. ముంబైలో ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఎయిర్పోర్ట్ లోడర్ల కోసం .. ఎయిర్ ఇండియా సంస్థ వాకిన్ ఇంటర్వ్యూలో పెట్టింది. 600 పోస్టుల కోసం జరిగిన వాకిన్కు సుమారు 25 వేల మంది యువత హాజరయ్యారు. దీంతో ఎయిర్పోర్టు వద్ద పరిస్థితి అదుపు తప్పింది. వాకిన్కు వచ్చిన జనాన్ని అదుపు చేసేందుకు ఎయిర్ ఇండియా సిబ్బంది తెగ ఇబ్బందిపడింది.
బయోడేటా ఫామ్లు ఇచ్చేందుకు జనం ఎగబడ్డారు. కొన్ని గంటల పాటు అభ్యర్థులు వెయిట్ చేశారు. నీరు, ఆహారం లేకుండా ఉండిపోయారు. కొందరైతే అస్వస్థతకు లోనయ్యారు. విమానాల్లో లగేజీని లోడింగ్, అన్లోడింగ్ కోసం ఎయిర్ పోర్టు లోడర్లను నియమిస్తుంటారు. ఎయిర్పోర్టు లోడర్లు బ్యాగేజీ బెల్టులు, ర్యాంప్ ట్రాక్టర్లను ఆపరేట్ చేస్తారు. ప్రతి విమానానికి చెందిన లగేజీ, కార్గో, ఫుడ్ సప్లయిని చూసుకునేందుకు కనీసం అయిదు మంది లోడర్లు అవసరం వస్తుంటుంది. ఎయిర్ పోర్టు లోడర్ల జీతం నెలకు 20 నుంచి 25వేల మధ్య ఉంటుంది. ఓవర్టైమ్తో ఆ జీతం 30వేల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది.
Walk-in interview at Air India Airport Services Ltd. in Kalina, Mumbai. pic.twitter.com/BnTfMCx4uq
— Cow Momma (@Cow__Momma) July 17, 2024