న్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరించిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన భారత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ఎట్టకేలకు చార్జిషీట్ నమోదైంది. మూడు నెలల దర్యాప్తు అనంతరం ఆమె గూఢచర్యానికి పాల్పడిందనడానికి బలమైన ఆధారాలు లభించాయని, దీంతో ఆమెపై 2,500 పేజీల చార్జిషీట్ నమోదు చేసినట్టు పోలీస్‌లు తెలిపారు.
ఈ ఏడాది మేలో అరెస్టయిన జ్యోతి మల్హోత్రాకు ఐఎస్ఐ ఏజెంట్లు షకీర్, హసన్ అలీ, నసీర్ థిల్లాన్ తదితరులతో టచ్‌లో ఉన్నట్టు చార్జిషీట్లో ఆరోపించారు.