అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India Plane Crash) మరణించిన వారిని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అయిన 25 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. బాధిత కుటుంబాలకు సహాయం, సమన్వయం కోసం 230 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు రిలీఫ్ కమిషనర్, ఐఏఎస్ అధికారి అలోక్ పాండే తెలిపారు. ప్రతి బృందంలో ఒక పోలీసు అధికారి, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి, ఒక ప్రొఫెషనల్ కౌన్సెలర్ ఉన్నట్లు చెప్పారు. డీఎన్ఏ టెస్ట్‌ల ద్వారా గుర్తించిన మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 22 మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లు వెల్లడించారు. చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేయడానికి 22 విచారణ బృందాలు కూడా పనిచేస్తున్నాయని అన్నారు.
కాగా, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మందికిపైగా మరణించారు. చాలా మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్లో మృతుల గుర్తింపు కోసం డీఎన్ఏ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ తెలిపారు. ఇప్పటి వరకు 47 డీఎన్ఏ టెస్ట్‌లు మ్యాచ్ అయ్యాయని చెప్పారు. 44 కుటుంబాలను సంప్రదించామని అన్నారు. 25 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు వెల్లడించారు.
మరోవైపు శాంతిభద్రతలు, లాజిస్టిక్స్ కోసం సివిల్ ఆసుపత్రి వద్ద ఏడుగురు ఐపీఎస్ అధికారులతోపాటు 500 మంది పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు సీనియర్ పోలీసు అధికారి జైపాల్ ఎస్ రాథోడ్ తెలిపారు. ఎలాంటి ఆలస్యం లేకుండా బాధిత కుటుంబాలకు మృతదేహాలు చేరేలా సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు.
Also Read:
Air India Plane Crash | కూలిన ఎయిర్ ఇండియా విమానం నిర్వహణలో మా సంస్థకు సంబంధం లేదు: టర్కీ
Watch: జిప్‌లైన్‌పై వేలాడుతూ వెళ్తున్న బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?
Tej Pratap | కాశీ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో తేజ్ ప్రతాప్ వీడియో.. దర్యాప్తునకు ఆదేశం