న్యూఢిల్లీ: ‘నా ఖావూంగీ, నా ఖానేదూంగీ’ అని డైలాగులు చెప్పిన మోదీ సర్కార్, రైల్వే శాఖలో జరుగుతున్న అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నది. రైల్వే శాఖకు చెందిన ఓ జోన్ పరిధిలో ఐదు డివిజన్లలో లోకోమోటివ్స్ రైల్వేలను నడిపేందుకు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే హైస్పీడ్ డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నది. దీనికి సంబంధించి రూ.243 కోట్లు అధికంగా చమురు సంస్థలకు చెల్లించినట్టు, డీజిల్ ధరల్ని 25 నుంచి 45శాతం ఎక్కువగా కోట్ చేశారని విజిలెన్స్ శాఖ ఆడిటింగ్‌లో బయటపడింది. 2022 జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో వందల కోట్లు అధిక చెల్లింపులు జరిగాయని అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణం బయటపడిన తర్వాత, దేశంలోని 16 రైల్వే జోన్ల పరిధిలో హైస్పీడ్ డీజిల్ కొనుగోళ్లు జరిగాయి. వీటన్నింటిపైనా ఆడిటింగ్ నిర్వహించాలని రైల్వే అధికారులు తేల్చారు.