న్యూ ఢిల్లీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని మొత్తం 24 ఎయిర్‌పోర్టులను ఈ నెల 15 వరకు మూసి ఉంచనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు తెలిపినట్టు పీటీఐ కథనం పేర్కొంది. ఇప్పటికే ఈ 24 ఎయిర్‌పోర్టుల్లో పౌర విమానాలను నేటి (శనివారం) వరకు మూసి ఉంచారు.
ఈ నేపథ్యంలో తమ ఫ్లైట్లను ఈనెల 15 వరకు రద్దు చేస్తున్నట్టు పలు ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. శ్రీనగర్, చంఢీగఢ్, అమృత్సర్, లూథియానా, భుంతార్, కిషన్‌గఢ్, పటియాలా, షిమ్లా, ధర్మశాల, భటిండా, జైసల్మేర్, జోథ్‌పూర్, లేహ్, బికనేర్, పఠాన్‌కోట్, జమ్ము, జామ్‌నగర్, భూజ్లలో ఎయిర్‌పోర్టులను ఈనెల 15 సాయంత్రం 5.29 గంటల వరకు మూసి ఉంచనున్నారు. ఆయా ఎయిర్ పోర్టుల్లో తమ విమాన సేవలను ఎయిర్ ఇండియా వెల్లడించింది.