Social Media Influencer | ఓ సోషల్ మీడియా స్టార్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన 23 ఏండ్ల లీనా నగ్వాన్షీ (Leena Nagvanshi) బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. లీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లీనాకు ఏకంగా పదివేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, చదువుకునేందుకని ఇంటి టెర్రస్‌పైకి వెళ్లిన లీనా చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది సేపటికి గమనించిన కుటుంబ సభ్యులు లీనాని కిందకి దించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
లీనా ఆత్మహ్యతకు గల కారణాలు తెలియరాలేదని.. సూసైడ్ నోట్ కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా లీనా ఫోన్ సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.