Covid Death | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. ఇటీవల రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. మహమ్మారితో ఇప్పటికే ఢిల్లీలో కొవిడ్‌తో మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం 22 సంవత్సరాల బాలిక కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే బాలిక టీబీతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది కొవిడ్ మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. జనవరి ఒకటి నుంచి ఢిల్లీలో 436 మందికి కరోనా సోకింది. ఇందులో 357 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. శనివారం 91 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి ఇండ్లకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ పేర్కొంది.
ప్రైవేటు ఆసుపత్రుల సహకారం సైతం తీసుకుంటున్నామని.. ప్రస్తుతం రోగులు భయపడాల్సిన అవసరం లేదని.. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. రోగులకు పడకలు, మందులు, ఇతర అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ప్రస్తుతానికి కరోనాను తేలికగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిస్తున్నారు. ఇంట్లో వృద్ధులు, తీవ్రమైన రోగులు సురక్షితంగా ఉండాలని.. కరోనా మహమ్మారి తర్వాత చిన్న చిన్న వ్యాధులు చాలాకాలం పాటు కొనసాగుతున్నాయని డాక్టర్ చెబుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తేలికపాటి లక్షణాలు నెలల తరబడి రోగులను ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరిలోనైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే, వైద్యుడిని సంప్రదించాలని వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
సరైన చికిత్స తీసుకోవాలని.. తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని నిపుణులు చెప్పారు. కొవిడ్ కొత్త వేరియంట్‌తో పెద్దగా ప్రమాదమేమీ లేదని.. సాధారణ ప్రజలను ప్రభావితం చేయదని.. వారి ద్వారా ఖచ్చితంగా మరికొందరికి సోకే ప్రమాదం ఉంది. వల్లభాయ్ పటేల్ ఛాతి ఆసుపత్రి డైరెక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ముఖ్యంగా వైరస్ బారినపడకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఉబ్బసం వంటి శ్వాసకోశ రోగులు కోవిడ్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని. బయటకు వెళ్లే సమయంలో మాస్క్‌లు ఉపయోగించాలని.. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు. నేషనల్ మెడికల్ ఫోరం, ఢిల్లీ హాస్పిటల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ ప్రేమ్ అగర్వాల్ మాట్లాడుతూ కొత్త కోవిడ్ వేరియంట్ అంత ప్రమాదం కాదని.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరమన్నారు.