బీజాపూర్: చత్తీస్‌ఘడ్‌లో ఇవాళ 22 మంది నక్సలైట్లను అరెస్టు(Naxals Arrest) చేశారు. వారి వద్ద నుంచి పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలో మూడు చోట్ల నుంచి ఆ సామాగ్రిని సీజ్ చేశారు. ఉసూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న టేకమెట్ల గ్రామం అటవీ ప్రాంతం నుంచి ఏడు మంది క్యాడర్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులతో పాటు కోబ్రా కమాండోలు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్‌లో నక్సల్స్ చిక్కారు.
జంగ్లా పోలీసు స్టేషన్ పరిధిలోని బెల్చార్ గ్రామం నుంచి ఆరు మంది నక్సల్స్, నీలస్నార్ పోలీసు స్టేషన్ పరిధిలోని కందకర్ల గ్రామం అడవుల నుంచి 9 మంది నక్సల్స్‌ను అరెస్టు చేశారు. రెండు చోట్ల భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నక్సలైట్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి టిఫిన్ బాంబులు, జిలాటిన్ స్టిక్స్, డెటోనేటర్లు, ఎలక్ట్రిక్ వైర్లు, బ్యాటరీలు, మావో కరపత్రాలు, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు.
అరెస్టు అయిన వారిలో 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న నక్సల్స్ ఉన్నారు.