ముంబై: భారీ వినాయక విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా అది కూలింది. అక్కడున్న జనంపై ఆ భారీ విగ్రహం పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Ganesh Idol Falls) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. దక్షిణ ముంబై భూలేశ్వర్‌లోని బలరామ్ మర్చంట్ రోడ్డులో ప్రతి ఏటా భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పది గంటల సమయంలో 22 అడుగుల ఎత్తైన ‘భూలేశ్వరచా రాజా’ వినాయక విగ్రహాన్ని స్థానిక మండపానికి వాహనంలో తరలించసాగారు.
కాగా, ఫ్రేమ్‌కు ఉన్న కొన్ని నట్స్, బోల్ట్స్ వదులుగా ఉండటం వల్ల ఆ భారీ విగ్రహం ముందుకు పడిపోయింది. అక్కడున్న యువకులపై అది పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్దారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక దళం, ముంబై పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, 108 అంబులెన్స్ సర్వీస్, మున్సిపల్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు గాయపడిన వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఇద్దరు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులను 33 ఏళ్ల సంకేత్ నెవ్షే, 30 ఏళ్ల బ్రిజేష్ హేమంత్ జోషిగా గుర్తించారు. గాయపడిన మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bhuleshwar Ganpati Bappa, Mumbai
Two dead, five injured after a massive 22-foot Ganesh Idol of Bhuleshwar Cha Raja falls during its arrival procession.
Among the five injured, two are girls aged 5 and 7.Seems welding of the frame holding idol wasn’t done properly. pic.twitter.com/FBfcLAd0nU
— D (@Deb_livnletliv) August 23, 2026