పాట్నా, అక్టోబర్ 8: బీహార్‌లోని వివిధ జిల్లాల్లో వేర్వేరు ప్రమాదాల్లో నీట మునిగి 22 మంది మృతి చెందారు. జీవిత్పుత్రిక పండుగతో పాటు ఇతర ఘటనల్లో నదులు, చెరువుల్లో స్నానాలు చేస్తూ మునిగి 22 మంది మరణించారని అధికారులు తెలిపారు.
భోజ్‌పూర్‌లో ఐదుగురు, జెహన్బాద్లో నలుగురు, పాట్నా, రోహ్తాస్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఘటనలో ఒక బాలిక సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ నీటిలో కొట్టుకుపోగా, ఆమెను రక్షించబోయి నలుగురు బాలికలు మృతిచెందారు.