సోమవారం 13 జూలై 2020
National - Jun 24, 2020 , 19:42:22

పిల్లలు మాట వినట్లేదా? ఇవి పాటించండి....

పిల్లలు మాట వినట్లేదా? ఇవి పాటించండి....

హైదరాబాద్ : చిన్నపిల్లలకు తొలి గురువులు తల్లిదండ్రులే. ఇంటి వాతావరణం ,కుటుంబ సభ్యుల ప్రవర్తన పిల్లలపై మరింతగా ప్రభావం చూపుతుంది. కనుక తల్లిదండ్రులు చిన్నారుల సున్నితమైన మనసుల్లో మంచి భావాలతో పాటు , మంచి అలవాట్లను పెంపొందించేలా చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ఉంటాడు. కొందరు ఎప్పుడూ చిలిపి చేష్టలు చేస్తుంటారు . కొందరు పిల్లలు కొంచెం ఆట పట్టిస్తారు. ఆ సమయం లో పిల్లలు తల్లిదండ్రులను చాలా ఇబ్బందులు పెడతారు. అంతేకాదు అసభ్య పదజాలంతో వారిని  తిడుతూ ఉంటారు. అందుకే పిల్లలను గారాభం చేయకూడదు. అతి గారాభం చాలా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది. అలాగే ఇంట్లోని వస్తువులను పగలగొట్టడం, ఎక్కువగా అరుస్తూ ఉండటం, ప్రతిసారీ గుమ్మం దాటి బయటకు వెళ్లడం వంటివి చేసినప్పుడు మీరు కోపం తెచ్చుకోకూడదు.

అలాగే పిల్లలను కొడితే లేదా తిడితే వారికి జ్ఞానం వస్తుందనే భావనలో ఉంటే ముందు దాన్ని వదిలేయాలి. నేటి తరం తల్లిదండ్రులు పిల్లలకు గ్యాడ్జెట్స్ ఇవ్వడం సాధారణమైంది. ఇక కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి వ్యసనాలను ప్రోత్సహిస్తున్నారు. అందుకే మీరు పిల్లల వద్ద ఉన్నప్పుడు మీరు గ్యాడ్జెట్ వ్యసనాన్ని పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకోసమే పిల్లల ముందు మీ మొబైల్ వాడకాన్ని తగ్గించండి. మీ పిల్లలను బయటకు వెళ్లి ఆటలు ఆడేవిధంగా ప్రోత్సహించాలి. ఆటలు ఆడడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా దృడంగా ఉంటారు. అలాగే చిన్న పిల్లలకు, గాడ్జెట్‌ను పరిమిత సమయం వరకే ఉపయోగించాలనే నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లలు పెరిగేకొద్దీ వారికి స్వేచ్ఛను ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల తో  స్నేహపూర్వకంగా మెలగాలి. చెప్ప్పాల్సిన పద్ధతిలో వారికి చెప్పాలి.  


logo