బుధవారం 08 జూలై 2020
National - Jun 23, 2020 , 00:43:41

ఆందోళన లో ఎంఎస్ఎంఈలు

ఆందోళన లో ఎంఎస్ఎంఈలు

ఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అన్ని విధాలుగా నాశనం చేసింది. ఇప్పటికే డిమాండ్ తగ్గిన నేపథ్యంలో అధిక వడ్డీ రేట్లకు, మూసేసిన ఈ సంస్థల కోసం రుణాలు తీసుకుంటే ఇది మరింత భారంగా మారుతుందని ఎంఎస్ఎంఈలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్కువ వడ్డీకి రుణాలు, స్థిరఖర్చులు, విద్యుత్ ఛార్జీల మాఫీ వంటి స్వల్పకాలిక వంటి ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి అవసరమని ఎంఎస్ఎంఈలు చెబుతున్నాయి. లేదంటే డిమాండ్ లేక, ఇప్పటికే మూతబడి ఉన్న కంపెనీలు తెరిచేందుకు అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకుంటే భారం పెరిగి మళ్లీ కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి లేర్పడుతాయంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత కొలమానాలా ప్రకారం కొన్ని కంపెనీలు రుణాలు తీసుకోవాలన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు వివిధ అనుకూలతలు ఉండాలని ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. మొత్తం ఎంఎస్ఎంఈ రుణాల్లో మైక్రో ఎంటర్‌ప్రైజ్ వాటా 32 శాతంగా ఉన్నది. ఎంఎస్ఎంఈల రెవెన్యూ 17-21 శాతం పడిపోయింది. బలహీనమైన డిమాండ్ నేపథ్యంలో ఎబిడా మార్జిన్ 4 నుండి 5 శాతానికి తగ్గే అవకాశమున్నది. ఇది లాభాలను తగ్గిస్తుంది. ఆపరషనల్ ఖర్చులు అంతే ఉండటం లేదా పెరగడం ఉంటుంది. డిమాండ్ అంతగా లేనందున చిన్న, మధ్యతరహా సంస్థలకు ఫ్రెష్‌గా లోన్స్ అవసరం తక్కువగాను ఉండవచ్చునని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. 


logo