వేములవాడ రూరల్, మార్చి 25: వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రత, ఆరోగ్యంపై ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి గురువారం అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రం ఆవరణలో సాగుచేసిన కూరగాయలు, ఆకుకూర తోటను పరిశీలించారు. కేంద్రంలో పండించిన కూరగాయలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోష్టికాహారంగా అందించాలని సూచించారు. సర్పంచ్ సామ కవిత, ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, అంగన్వాడీ టీచర్ వాణి, ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పోషకాహారాన్ని తీసుకోవాలి
గంభీరావుపేట, మార్చి 25: పోషకాహారం తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అంగన్వాడీ సూపర్ వైజర్ పద్మజ పేర్కొన్నారు. మండలంలోని మల్లారెడ్డిపేటలో గురువారం అంగన్వాడీ కేంద్రా ల్లో నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసి వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలను పండించుకోవాలని సూచించారు. సర్పంచ్ శెట్టి మహేశ్వరి, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వేములవాడ, మార్చి 25: మార్కండేయనగర్ అం గన్వాడీ కేంద్రం పరిధిలో అంగన్వాడీ టీచర్ జ్యోతి ఇంటింటికీ తిరుగుతూ ఇంట్లోనే కూరగాయలను సాగుచేసుకోవాలని సూచించారు. ఇలా పండించే కూరగాయాల్లో ఉండే పోషక విలువల గురించి వివరించారు.
వీర్నపల్లి, మార్చి 25: బంజెర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ గుగులోత్ కళాగోపాల్ నాయక్ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఎంపీపీ భూల సంతోష్ హాజరై పరిశుభ్రత, పౌష్టికాహారంపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. సూపర్వైజర్ కళావతి, నరేశ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆశ కార్యకర్తలు, నాయకులు నాగరాజు, రవినాయక్ పాల్గొన్నారు.
చందుర్తి, మార్చి 25: మండలంలోని రామన్నపేట, మూడపల్లి, బండపల్లి, ఆశిరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల తల్లిదండ్రులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం కిచెన్ గార్డెన్లను పరిశీలించారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు మంగాదేవి, మంజుల, రేణుక, మంగమ్మ, భూజ్యోతి, రాధిక, పద్మ తదితరులు పాల్గొన్నారు.
కోనరావుపేట, మార్చి 25: నిజామాబాద్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. సూపర్ వైజర్ నిర్మలాదేవి, సర్పంచ్ కేతిరెడ్డి అరుణ, వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత, ఉపసర్పంచ్ చేకూట మల్లేశం, అంగన్వాడీ టీచర్లు సింగం సూర్యకళ, భూరుగుపల్లి విజయలక్ష్మి, ఇనుకొండ విజయలక్ష్మి తదితరులున్నారు.