వారణాసి, నవంబర్ 30: యూపీలోని వారణాసి కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లోని పార్కింగ్ ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ఫారం ఒకటికి సమీపంలో ఉన్న ఈ పార్కింగ్ స్టాండ్లో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 150కి పైగా ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ మరణించ లేదని, గాయపడలేదని రైల్వే అధికారులు తెలిపారు. అగ్నిమాపక, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రైల్వే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్టాండ్లో వందకుపైగా వాహనాలు దగ్ధమయ్యాయని, నష్టం ఎక్కువగానే ఉందని అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ లాల్జీ చౌదరి తెలిపారు.