కోల్‌కతా / బీహార్ : పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బెంగాల్లో గడిచిన 24 గంటల్లో 100 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా బీహార్‌లో గత రెండు రోజుల్లో 100 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు.
ఆదివారం ఒక్కరోజే వెస్ట్ బెంగాల్లో 6,153 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక్క కోల్‌కతాలోనే 3,194 కేసులు నమోదైనట్లు బెంగాల్ వైద్యాధికారులు ప్రకటించారు. కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీలో 70 మంది డాక్టర్లకు, చిత్తరంజన్ సేవా సదన్, శిశు సదన్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న 24 మంది వైద్యులకు, ఆప్తామాలజీ ఇన్స్టిట్యూట్లో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా బారిన పడ్డ వైద్యులందరూ క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల కాంట్రాక్టులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైపోయారు.
బీహార్‌లోనూ 100 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. పాట్నాలోని నలంద మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోనే 96 మంది వైద్యులు కరోనా పాజిటివ్‌గా పరీక్షించబడ్డారు. రెండు రోజుల్లోనే 100 మంది వైద్యులు కరోనా బారిన పడటంతో.. వారి కాంట్రాక్టులను గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.