లక్నో: పెళ్లి ఊరేగింపులో ఒక వ్యక్తి సరదా కోసం గన్తో గాలిలోకి కాల్పులు జరిపాడు. అయితే బాల్కానీ నుంచి ఈ వేడుక చూస్తున్న కుటుంబంలోని చిన్నారికి బుల్లెట్ తగిలింది. దీంతో రెండేళ్ల బాలుడు మరణించాడు. (Child Killed In Celebratory Firing) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 16న ఆదివారం రాత్రి పది గంటల సమయంలో నోయిడా పరిధిలోని అఘపూర్ గ్రామంలో పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన వరుడి బంధువైన వ్యక్తి గన్తో గాలిలోకి కాల్పులు జరిపాడు.
కాగా, వికాస్ శర్మ, అతడి కుటుంబం తమ ఇంటి బాల్కనీ నుంచి వివాహ ఊరేగింపును చూడసాగారు. అయితే అతడి రెండేళ్ల కుమారుడికి గన్ బుల్లెట్ తగిలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు మరణించిన బాలుడి తండ్రి వికాస్ శర్మ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలో కాల్పులు జరిపిన నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
#noida आगाहपुर में बारात चढ़ने के दौरान हुई हर्ष फायरिंग में बारात देख रहे ढाई साल के बच्चे की गोली लगने से मौत। सेक्टर-49 थाना क्षेत्र का मामला। @NBTDilli @noidapolice @Uppolice pic.twitter.com/Hki7CH2n3I
— Ankit tiwari/अंकित तिवारी (@ankitnbt) February 17, 2025