శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దురు ముష్కరులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలోని హసన్‌పొరాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్, గాలింపు చేపట్టాయి. అయితే భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో గాలింపు కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
గాలింపు బృందాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని వెల్లడించారు. వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. ఆ ప్రాంతంతో టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించాయని తెలిపారు.
Jammu & Kashmir | 2 unidentified terrorists killed at the Hasaanpora area of Kulgam; incriminating materials, including arms & ammunition, have been recovered. Further details awaited: Kashmir Zone Police https://t.co/YUZVR5KLNj pic.twitter.com/wojHDH8i9m
— ANI (@ANI) January 9, 2022
కశ్మీర్లో గత దు రోజుల్లో ఇదిమూడో ఎన్కౌంటర్. గత శుక్రవారం (జనవరి 7) బుద్గాంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారంతా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఈనెల 5న పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒకరు పాకిస్థాన్ జాతీయుడు ఉన్నారు.