Terrorists arrest | అమృత్‌సర్‌లో ఇద్దరు తీవ్రవాదులు అరెస్ట్.. 3 హ్యాండ్ గ్రనేడ్, లక్ష నగదు స్వాధీనం
Terrorists arrest | అమృత్‌సర్‌లో ఇద్దరు తీవ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 3 హ్యాండ్ గ్రనేడ్లు, లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌సర్‌లో పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నారని అందిన పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
Terrorists arrest | పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో స్థానిక పోలీసులు ఇద్దరు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఫిరోజ్‌పూర్ నివాసితులుగా గుర్తించారు. వారి కారులో సోదాలు చేపట్టిన పోలీసులకు మూడు హ్యాండ్ గ్రనేడ్లతో పాటు రూ.లక్ష నగదు లభించింది. అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితులిద్దరినీ పట్టుకున్నారు.
ఫిరోజ్‌పూర్‌లోని బరాకే గ్రామానికి చెందిన ప్రకాష్ సింగ్. అలీ గ్రామానికి చెందిన ఇంగ్లిష్ సింగ్ డాబుర్జి సమీపంలోని గ్రీన్ ఫీల్డ్, గార్డెన్ ఎన్‌క్లేవ్‌లో వైట్ కలర్ బ్రెజ్జా కారులో తిరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వీరి వద్ద పేలుడు పదార్థాలు ఉన్నాయని, భారీ ఘటనకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నారని పోలీసులకు ఆకాశ రామన్న సమాచారమిచ్చాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రీన్ ఫీల్డ్, గార్డెన్ ఎన్‌క్లేవ్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సెర్చ్ సమయంలో నిందితుల నుంచి 3 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి లక్ష రూపాయలను కూడా స్వాధీనపర్చుకున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

