viral video | జంటగా ట్రెకింగ్‌కు వెళ్తున్నారా.. కేతన్ హత్య తర్వాత జాగ్రత్తగా ఉంటున్న మగాళ్లు.. ఇదిగో వీడియో
viral video : ఇటీవల పూనేలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కాబోయే భర్తను విహారానికి తీసుకెళ్లిన అతడి కాబోయే భార్య సియా గోయల్.. అతడిని పర్వతంపైనుంచి తోసేసి చంపేసింది. అంతకుముందు కూడా సోనమ్ అనే మహిళ తన భర్తను ఇలాగే మేఘాలయలోని పర్వత ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయించింది.
viral video : ఇటీవల పూనేలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కాబోయే భర్తను విహారానికి తీసుకెళ్లిన అతడి కాబోయే భార్య సియా గోయల్.. అతడిని పర్వతంపైనుంచి తోసేసి చంపేసింది. అంతకుముందు కూడా సోనమ్ అనే మహిళ తన భర్తను ఇలాగే మేఘాలయలోని పర్వత ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయించింది. దీంతో ఇటీవలి కాలంలో భార్యతోనో, ప్రేయసితోనో పర్వత ప్రాంతాలకు టూర్ వెళ్లాలంటేనే మగాళ్లు భయపడుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మీమ్స్ పేలిపోతున్నాయి.
పలు ఫన్నీ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ అంశం మీదే ఇన్ఫ్లుయెన్సర్లు బోలెడన్ని వీడియోస్ తీస్తున్నారు. ఈ సీరియస్ అంశాన్ని కొందరు కామెడీ కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి చోట్లకు జంటగా వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని మగాళ్లు సీరియస్‌గా తీసుకుంటున్నారు. కావాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఎక్కడ తీశారో వివరాలు తెలియదు. కానీ, ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఒక జంట పర్వత ప్రాంతానికి ట్రెకింగ్‌కు వెళ్లింది. అయితే, ఇటీవలి పూనే హత్య నేపథ్యంలో ఆ భర్త తన రక్షణ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన భార్య చేతిని, తన చేతిని ఒక దుపట్టా (చున్నీ)తో కట్టి ఉంచాడు. ఎక్కడైనా తన భార్య తనను పర్వతం పైనుంచి తోసేయకుండా ఉండేందుకు ఇలా తన భార్యతో కలిసి దుపట్టా కట్టుకున్నట్లు భర్త చెప్పాడు.
Couple ties hands together with dupatta during hill trek. pic.twitter.com/71OEXi85iP
— Manip0 (@magbhu55) July 6, 2026
దీనివల్ల ఆ భార్య అతడిని తోసేయలేదు. ఒకవేళ అలా చేసినా, ఆమె కూడా అతడితోపాటే లోయలో పడిపోతుంది. అందుకే ఇప్పుడు ఇద్దరూ సేఫ్. భర్త వల్ల భార్యకు.. భార్య వల్ల భర్తకు ఎలాంటి హానీ ఉండదు. ఈ వీడియోలో కనిపిస్తున్న జంట.. అలా దుపట్టా ఇద్దరి చేతులకు కట్టుకునే పర్వాతారోహణ చేశారు. వీరిద్దరినీ ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్ అవుతోంది. జంటగా పర్వతాలపైకి వెళ్లినప్పుడు ఈ ఐడియా ఏదో పాటిస్తే బాగుంటుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

