Pune Hit And Run | బైక్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మృతి
Pune Hit And Run | వేగంగా దూసుకొచ్చిన కారు ఒక బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్పై ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మరణించారు. నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.
ముంబై: వేగంగా దూసుకొచ్చిన కారు ఒక బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్పై ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మరణించారు. నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు. (Pune Hit And Run) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున బొపోడి అండర్పాస్ సమీపంలో పోలీసులు నైట్ పెట్రోలింగ్ చేస్తున్న బైక్ను ఒక కారు ఢీకొట్టింది. దీంతో 42 ఏళ్ల కానిస్టేబుల్ సమాధాన్ కోలీ అక్కడికక్కడే మరణించాడు. 36 ఏళ్ల మరో కానిస్టేబుల్ సంజోగ్ షిండే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
కాగా, ఈ ప్రమాదంపై పోలీసులు స్పందించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. పోలీసులు ఉన్న బైక్ను ఢీకొట్టి వెళ్లిపోయిన కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మరణానికి కారణమైన నిందితుడు 24 ఏళ్ల సిద్ధార్థ రాజు కెంగార్ అలియాస్ గోత్యాను అతడి ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. ప్రమాదం సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడా అన్నది తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ఆ సమయంలో ఆ కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bike
- car
- Dead
- hit and run case
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

