న్యూఢిల్లీ: రెండు సింహాలు, రెండు శునకాలు(Dogs Vs Lions).. రాత్రి వేళ దాదాపు ఫైట్ సీన్ క్రియేట్ చేశాయి. గోవుల షెడ్డు గేటు వద్ద.. ఒకవైపు సింహాలు, మరో వైపు కుక్కలు నిలబడి.. ఘర్షణ పడేలా అరిచాయి. ఈ ఘటన గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో జరిగింది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆ గేటు వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలకు సింహాలు, కుక్కలకు చెందిన ఫైట్ చిక్కింది.
గోవుల షెడ్డు లోపలికి ఎంట్రీ ఇచ్చేందుకు సింహాలు ప్రయత్నించాయి. కానీ గేటుకు మరో వైపు ఉన్న రెండు కుక్కలు అరుస్తూ ఆ సింహాలను అడ్డుకున్నాయి. నాలుగు జంతువులూ అరుస్తూ.. గేటును అటూ ఇటూ ఊపేశాయి. ఐరన్ గేటు బలంగా ఉండడం వల్ల శునకాలు సేఫ్గా ఉన్నాయి. కాసేపటి తర్వాత సమీపంలో ఉన్న పొదల్లోకి సింహాలు పారియాయి.
గోవుల షెడ్డు కాపల కాస్తున్న ఓ వ్యక్తి గేటు వద్దకు వచ్చి చూశాడు. ఆ తర్వాత పొదల్లోకి ఏం వెళ్లిందన్న కోణంలో లైట్ పెట్టి చూశాడు. మళ్లీ షెడ్డులోకి వెళ్లి గేట్లకు తాళం వేశాడు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి సింహాలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన రాలేదు.
2020 లెక్కల ప్రకారం గుజరాత్లో 674 ఆసియా జాతి సింహాలు ఉన్నాయి.
Shocking Visuals From #Gujarat
A viral video from Thoradi village, Savarkundla, Amreli, shows a tense standoff between two dogs and two lions, with only an iron gate separating them. #CCTVFootage #Savarkundla #Amreli #Lions #Dogs pic.twitter.com/j2oFXJuMma
— Hyderabad Netizens News (@HYDNetizensNews) August 14, 2024