ఇదో అద్భుతమైన ఫన్ రైడ్
‘ఇది నా కెరీర్లో మెమరబుల్ మూవీ. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. నేనైతే ఎంజాయ్ చేస్తూ పనిచేశాను. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంటుంది.
‘ఇది నా కెరీర్లో మెమరబుల్ మూవీ. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. నేనైతే ఎంజాయ్ చేస్తూ పనిచేశాను. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంటుంది. ఇందులో కథానాయికలిద్దరూ సినిమాకు ఎక్కడలేని అందాన్ని తెచ్చారు. కిశోర్ తిరుమల అద్భుతమైన దర్శకుడు. ఇప్పటివరకూ ఎమోషనల్ కథలు తీసిన కిశోర్ ఈ సినిమాతో కడుపుబ్బ నవ్విస్తాడు. ఇదో అద్భుతమైన ఫన్ రైడ్. చూసి ఎంజాయ్ చేయండి.’ అని అగ్ర కథానాయకుడు రవితేజ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.
అషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలు. తిరుమల కిశోర్ దర్శకుడు. చెరుకూరి సుధాకర్ నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడారు.
దర్శకుడు తిరుమల కిశోర్ మాట్లాడుతూ ‘పనిచేసే కొద్దీ ఎంజాయ్ చేసిన సినిమా ఇది. ఆర్టిస్టుల మధ్య కెమిస్ట్రీనే ఈ సినిమాకు హైలైట్. పండక్కి అద్భుతమైన కామెడీ సినిమా చూస్తారు.’ అని చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల కథానాయికలు అషికా రంగనాథ్, డింపుల్ హయాతి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందంతోపాటు డైరెక్టర్స్ బాబీ, హరీశ్శంకర్, శివా నిర్వాణ, పవన్ బసంశెట్టి కూడా ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

